ఏపీ: తిరుపతిలో లైంగిక వేధింపులా..?

frame ఏపీ: తిరుపతిలో లైంగిక వేధింపులా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన చిన్న పిల్లల పైన అత్యాచార సంఘటనలు లైంగిక వేధింపుల ఘటనలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది చైన్ స్నాకర్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. ప్రభుత్వం వీటన్నిటికీ కూడా కట్టడి చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఆగడం లేదు..ఇలాంటి సమయంలో తాజాగా తిరుపతిలోని శిల్పరామంలో కూడా లైంగిక వేధింపుల ఘటన ఒక్కసారిగా అందరిని తీవ్ర కలకలానికి గురయ్యేలా చేస్తోంది. శిల్పారామం మ్యూజియం దగ్గర సెక్యూరిటీగా ఉన్నటువంటి మహిళపైన లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక అదే ఆఫీసులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ వెంకటరమణ మహిళ సెక్యూరిటీ పైన లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఆ మహిళ సెక్యూరిటీ తనకు లొంగకపోతే శిల్పారామం చైర్మన్ అతని కొడుక్కి చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ అలాగే ఉద్యోగం కూడా తీయించేలా చేస్తామంటూ బెదిరింపులు చేసినట్లు ఆ మహిళ తెలియజేస్తోంది.వెంకటరమణ నుంచి తనకు రక్షణ కల్పించాలని .. తిరుపతి శిల్పారామం పరిపాలన అధికారికి వెంకటరమణ సెక్యూరిటీ గార్డు పైన ఫిర్యాదు చేసింది ఆ మహిళ. ఇక శిల్పారామంలోని ఇతర మహిళ ఉద్యోగులను కూడా వెంకటరమణ వేదిస్తున్నారనే ఆరోపణలు కూడా బయటపడ్డాయట.



దీంతో ఆ ఆఫీసు ఉద్యోgగి పైన అటు అధికారులు చర్యలు తీసుకోవడమే కాకుండా స్థానికంగా కూడా పోలీసులు ఫిర్యాదు చేయడంతో వెంకటరమణ పైన కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ కూడా చేయబడుతున్నారట. కచ్చితంగా నిందితుడు తప్పు చేసినట్లు ఏదైనా ఆధారాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేస్తున్నారు. తిరుపతిలో కూడా లైంగిక వేధింపులు మహిళలపై జరుగుతున్న సంఘటన ఒక్కసారిగా అక్కడి ప్రజలను ఆందోళనకు గురయ్యేలా చేసింది. తిరుపతి శిల్పారామం అధికారులు కూడా ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకుండా ఏవైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: