
ఆ రాయలసీమ ఎమ్మెల్యే దందా... ఇలాంటోళ్లే ప్రజాస్వామ్యానికి ప్రమాదం..?
రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో నేతలు ఒకరిని మించి ఒకరు దందాలు, అవినీతిలో రాటు దేలిపోతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం .. ప్రకృతి వనరులను దోచుకోవడంలో వారే ముందు ఉంటారు. అందరూ కాదు కాని .. కొందరు ఎమ్మెల్యేలు అసలు ఏ పార్టీలో ఉన్నా వారి బుద్ధి, తీరు మార్చుకోరు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలు పార్టీలు మారిన ఓ నేత రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తాను ఆ ప్రాంతాన్ని పాలించే రాజును అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పిందే అక్కడ వేదం.. ఆయన చేసిందే అక్కడ శాసనం.. చివరకు చంద్రబాబు సైతం ఆయన విషయంలో జోక్యం చేసుకుని చెప్పినా తన దందా తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట వినకపోతే అక్కడ ఏ పని జరగదు.
ఆ నియోజకవర్గంలో పారిశ్రామిక కంపెనీలు ఉన్నాయి. అక్కడ సిమెంటు కంపెనీలు అంటే చాలా పనులు ఉంటాయి. ఆ పనులు అన్నీ తాను చెప్పిన వారికే ఇవ్వాలి. ఇప్పటికే ఆ పనులు చేయడానికి కొన్ని కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వాటన్నింటిని రద్దు చేసుకుని.. వారిని తప్పించి తన మనుష్యులకే ఆ పనులు ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే దందా గిరి చేస్తున్నారు. కొన్ని కంపెనీలకు కాంట్రాక్టులు కొనసాగుతుండడంతో అవి పూర్తయ్యాక ఆలోచిస్తామని సిమెంటు కంపెనీలు, ఇతర కంపెనీలు చెపుతున్నా ఆ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తన మనుష్యులకు కాంట్రాక్టులు ఇస్తారా ? తనకు కప్పం కడతారా ? అన్నట్టుగా ఆయన దందా కొనసాగుతోంది.
అసలు ఆ ఎమ్మెల్యే దందా వల్ల అక్కడ కంపెనీలు తమ ఉత్పత్తులు ఆపేసుకునే పరిస్థితి వచ్చేసింది. ముడి సరుకులు సిమెంట్ ప్లాంట్లకు పోకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి చెట్ల కింద ఆ ఎమ్మెల్యే అనుచరులు కూర్చుంటారు. చివరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా ఏం చేయలేక ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చినా ఆ ఎమ్మెల్యే తీరు మారలేదు. ఇప్పుడు ఈ విషయం బయటకు పూర్తిగా రావడంతో ఆ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక సదరు ఎమ్మెల్యే ప్లైయూష్ తీసుకు వెళ్లే వాహనాల వివాదంలోనూ తన అనుచరులను రంగంలోకి దింపి గలాటా క్రియేట్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేతతోనూ గొడవ పెట్టుకున్నారు. ఇక ఇలాంటి నేతల తీరు వల్ల రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి పెద్ద అవరోధంగా మారాయి. ఇలాంటి వారిని కట్టడి చేయడమో లేదా ఇలా చేస్తే నీ పనులు చేయం.. నీ నియోజకవర్గాన్ని లైట్ తీస్కొంటాం అని ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇవ్వకపోతే రాష్ట్రానికి రావాలనుకునే పరిశ్రమలు రావు.. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా వెనక్కి వెళ్లిపోతారు.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.