Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ?

frame Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ?

Veldandi Saikiran
పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ మరణించారు. క్యాథలిక్ మతపెద్ద ఆయన పోప్... తీవ్ర అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. ప్రస్తుతం పోప్ వయసు 88 సంవత్సరాలు ఉంది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోపు ఫ్రాన్సిస్... బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఇవాళ తీవ్ర విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వాటికన్ సిటీ లోని తన నివాసంలో.. పోపు ఫ్రాన్సిస్... మృతి చెందడం జరిగింది.

 ఈ విషయాన్ని స్వయంగా వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. పోపు నిన్న ఈస్టర్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వాటికన్ సిటీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఈస్టర్ పండుగే ఆయనకు చివరిదని పేర్కొంది. వాస్తవంగా పోపు ఫ్రాన్సిస్ గత కొన్ని సంవత్సరాలుగా... శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తీవ్రమైన శ్వాస సమస్య ఆయనకు సంభవించింది.

 ఈ అనారోగ్య సమస్య నేపథ్యంలోనే.... రూమ్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. ఇక గత రెండు నెలలుగా అక్కడే పోపు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం పెద్దగా మెరుగు పడలేదు. దీంతో ఇవాళ తుది శ్వాస విడిచారని వాటికన్ సిటీ అధికారులు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇక పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలోని ప్రముఖ నగరంలో జన్మించడం జరిగింది.

 పోపు ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మరియా. అయితే ఆయన... 2013 మార్చి 13వ తేదీన కేతలికి చర్చికి 26వ పోప్ గా ఎన్నిక కావడం జరిగింది. అమెరికా ఖండం నుంచి పోప్ గా నియామకం కావడం ఇదే తొలిసారి. అది కూడా ఆయనే కావడం విశేషం. ఇక పోపు ఫ్రాన్సిస్.. మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: