ఏపీ: బయటపడ్డ టిడిపి ఎమ్మెల్యే పిఏ రాసలీలలు.. ఏకంగా..?
తన భార్య అయినప్పటికీ కూడా తనతో వ్యక్తిగతంగా గడిపిన కొన్ని వీడియోలను ఫోటోలను తీసి మరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వహీద్ పైన ఆ బాధితురాలు తెలియజేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కోరినందుకు తన కుటుంబం పైన దాడి చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా తనకు న్యాయం జరగలేదంటూ ఆ మహిళ కన్నీటితో మీడియా ముందు వచ్చి కన్నీరు పెట్టుకుంటోంది. రీతిలో మరొక ముగ్గురు మహిళలను కూడా ఇలాంటి ప్రలోభాలు పెట్టి మోసగించాలనే విషయం ఆలస్యంగా బయటపడింది. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యే పిఏ పైన బాధిత మహిళలు కూడా లబోదిబోమంటున్నారు.
అంతేకాకుండా తనతో డిసెంబర్ 18వ తేదీన నిఖ జరిగిందని.. ఇంట్లో వాళ్ల భార్యకి చెప్పి వివాహం చేసుకున్నారని అందరి మహిళలతో చెప్పేవారిని.. ఇలాంటి వీడియోలు, ఫోటోలు తీస్తూ అందరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆ బాధ్యత మహిళ తెలియజేస్తోంది. తన పర్సనల్ మొబైల్ కూడా దాచిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారని తన భర్త అని మౌనంగా ఉన్న ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువగా అయ్యాయని ఆ భాదిత మహిళ తెలిపింది.
అంతేకాకుండా ఆ మహిళలందరూ కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటికి వెళ్లి మరి న్యాయం చేయాలని కోరినట్టుగా బాధితురాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అలాగే వాహిద్ చేతిలో గాయపడినటువంటి వ్యక్తి కడప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.