జగన్ ను అరెస్ట్ చేసేందుకు వణికిపోతున్న టీడీపీ ?
ముఖ్యంగా విజయ్ సాయి రెడ్డి, కసిరెడ్డి, పెద్దిరెడ్డి కుటుంబం, వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. చాలామందిని టార్గెట్ చేసి ఇప్పటికే కొంతమందిని అరెస్టు కూడా చేశారు. మరి కొంతమంది.. అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఎలాగైనా అరెస్టు చేయాలని... కొంతమంది టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నారా లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కు పర్సనల్గా కూడా రిక్వెస్ట్ లు పెడుతున్నారట కొంతమంది టిడిపి నేతలు. చంద్రబాబు నాయుడును జైల్లో వేసిన జగన్ మోహన్ రెడ్డిని ఒక రోజు ఎక్కువగా జైల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారట. అలాగే చంద్రబాబును ఉంచిన జైల్లోనే ఉంచి... అదే ఫుడ్ పెట్టించాలని కోరుతున్నారట. కానీ 70 శాతం మంది టీడీపీ నేతలు... ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ని అరెస్టు చేయడం వద్దు అంటూ... మొరపెట్టుకుంటున్నారట.
ఇలాంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే వైసిపి పార్టీ ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని హెచ్చరిస్తున్నారట. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన కారణంగా టిడిపి బలంగా పుంజుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు నేతలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుతున్నారట. కానీ కొంతమంది మాత్రం అరెస్టు చేయాల్సిందే అంటూ.. నారా లోకేష్ ను రెచ్చగొడుతున్నట్లు సమాచారం అందుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో వైయస్ జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు