కేసీఆర్ సభ... సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం క్లాస్ పీకినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభ నేపథ్యంలో... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర రావు చీల్చి చెండాడారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే... కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీశారు కేసీఆర్.

 అయితే దాదాపు ఈ సభకు ఏడు నుంచి 8 లక్షల మంది వచ్చి ఉంటారు. ఈ సభ దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు కూడా సృష్టించింది. కెసిఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో.... సీఎం రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిందట కాంగ్రెస్ అధిష్టానం. అనవసరంగా కెసిఆర్ సభను కాంగ్రెస్ నేతలేపారని... అనవసరంగా సభను అడ్డుకునే ప్రయత్నం చేసి కేసీఆర్ ను హీరో చేశారని కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

 కెసిఆర్ పేరును పదేపదే చెప్పి ఆయనను హీరో చేయడం తప్ప.... సాధించింది ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా చురకలు అందించారట  కాంగ్రెస్ అధిష్టానం నాయకులు. ఈ మేరకు... మీనాక్షి నటరాజన్ కూడా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అంతేకాదు... తెలంగాణ రాష్ట్రంలో.. మరో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట కాంగ్రెస్ పెద్దలు. మరో ఈ భారీ బహిరంగ సభ పై క్లారిటీ ఇవ్వాలని కూడా చెప్పారట.




ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: