ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఆయన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ పై పాక్ ప్రధాని షరీఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లోని ఐదు ప్రాంతాల్లో మాత్రమే భారత దాడులు చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇండియా చర్యలకు కచ్చితంగా పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.
శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ అలాగే ఆర్మీకి బాగా తెలుసు అని గుర్తు చేశారు. భారత మెరుపు దాడులపై సోషల్ మీడియా వేదికగా స్పందించి... కచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని పాక్ ప్రధాని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన పోస్ట్ పై అమెరికా స్పందించింది. ఇండియా దాడి చేసిందని
మీరు ప్రతి చర్యకు దిగకూడదని.. సూచనలు చేసింది. ఒకవేళ ప్రతి దాడులు చేస్తే రంగంలోకి మేము కూడా దిగుతామని వార్నింగ్ ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా మెరుపు దాడులు చేసింది.
అర్ధరాత్రి రెండు గంటల సమయంలో... మిస్సైల్లతో పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ అటు నేవీ బలగాలు.... పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రం మౌలిక సదుపాయాలు కూడా... ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. మొత్తం తొమ్మిది స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసినట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు