పహల్ గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పాకిస్తాన్ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు మొత్తం విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు యుద్ధం జరిగితే చూడాలా అని ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో భారత్ పాక్ నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తరచూ పాల్పడుతూ కవ్వింపు చర్యలు చేపడుతోంది. ఇలా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. పాకిస్తాన్ లో భారత దేశమే ఉగ్రవాదాన్ని పోషిస్తుందని అన్నారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్ కి కిరాయి సైనికులుగా ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
మా సరిహద్దుకు అన్ని వైపులా శత్రువులే ఉన్నారని ఆయన తెలియజేశారు. మా దేశానికి ఏమాత్రం భద్రతా ముప్పు వాటిల్లినా భారత్ తమపై దాడికి పాల్పడినా చరిత్రలో నిలిచిపోయేలా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. నియంత్రణ రేఖ గుండా భారతదేశంపై ఎప్పుడైనా దాడి చేయవచ్చని చెప్పకనే చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ స్వలాభం కోసమే పాకిస్థాన్ ను వాడుకుంటున్నారని, దేశాన్ని అణు యుద్ధం అంచుకు నెట్టేస్తున్నారని అన్నారు. ఖైబర్ , పఖ్తుంఖ్వా, బాలూచిస్తాన్ ఉగ్రవాదంలో న్యూఢిల్లీకి కూడా ప్రమేయం ఉందని తెలిపారు.
ఈ విధంగా పాక్ రక్షణ మంత్రి కామెంట్స్ చేయడంతో యుద్ధం రాబోతుంది అనడానికి మరింత బలం చేకూరింది. అంతే కాకుండా యుద్ధం రాబోతుందంటే పాకిస్తాన్ భయపడుతోందని కూడా ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. మరి చూడాలి యుద్ధమేఘాలు కమ్ముకుంటే ఇరుదేశాల పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి అనేది ముందు ముందు తెలుస్తుంది. అంతేకాకుండా ఇండియాకు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నాయి.