సింధూర్ : పాక్ క‌కావిక‌లు... తుపాకి దెబ్బ‌కు దొర‌క్కుండా పారిపోతున్నారుగా...!

RAMAKRISHNA S.S.
భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పుడే కకావికలం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్తో యుద్ధం విషయంలో ఏమాత్రం వెన‌క్కు తగ్గే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ పాకిస్తాన్పై కౌంటర్ ఎటాక్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే లాహుర్ - సియాల్కోట్ - కరాచీ పై భారత ప్రతీకార దాడి చేసింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ పై 26 యుద్ధ నౌక‌లు గురి పెట్టాయి. ఇప్పటికే కరాచీ పోర్టును సైతం భారత నేవి ధ్వంసం చేసింది. సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడుల య‌త్నాలు విఫలం కావడంతో గురువారం మరింతగా పెట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జట్లు భారత్ పై తీవ్ర స్థాయిలో దాడులకు తెరతీసాయి. రాజస్థాన్ మొదలుకొని జమ్మూ కాశ్మీర్ దాకా సరిహద్దుల వెంట వారి చోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర నివాసాల పైన గురిపెట్టాయి.


జ‌మ్మూ - శ్రీనగర్ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విపరీతనం చేశాయి. జమ్మూ శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. అయితే పాకిస్తాన్ దాడులు అన్నింటినీ సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. పఠాన్ కొట్లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. పాక్‌లోని ప‌లు ప్ర‌ధాన పట్టణాలపై దీర్ఘ శ్రేణి క్షిపణులతో రెండోసారి భారీ స్థాయిలో భారత దాడులకు దిగింది. లాహోరులోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అన్నింటినీ భారత సమూలంగా నాశనం చేస్తుంది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతంలో కీలక ఎయిర్పోర్టులో కంట్రోల్ సిస్టంను తుత్తనీయులు చేసింది. పాక్ నగరాలు బాంబు పేళుల్ల‌తో దద్దరిల్లినా.. పౌర ఆవాసాలు వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో స్థానిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసినట్టు సైన్యం పేర్కొంది. ఈరోజు సరిహద్దు భద్రతా దళాల చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చీప్ తో అమిత్ చర్చించారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: