ఆ పని చేయకండి అంటూ బతిమిలాడుతున్న ఇండియన్ ఆర్మీ.?

Pandrala Sravanthi
ఏంటి ఇండియన్ ఆర్మీ భారతదేశ పౌరులని బతిమిలాడడం ఏంటి..ఇది ఏదైనా ఫేక్ వార్తనా ఏంటి అనుకుంటారు చాలామంది. కానీ ఇది ఫేక్ వార్త కాదు. నిజమే.. ఇండియన్ ఆర్మీ స్వయంగా భారతదేశ పౌరులను విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆ పని చేయకండి అని.. మరి ఇంతకీ భారతదేశ ఆర్మీ ఇండియన్స్ ని అంతగా విజ్ఞప్తి చేయాల్సిన పని ఏముంది.. ఇంతకీ వాళ్లు ఏ పని చేయకండి అని అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య భీకరమైన పోరు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ ని భారత్ లోకి పంపించినప్పటికీ గగనతనంలోనే చిత్తుచిత్తుగా చేశారు ఇండియన్ ఆర్మీ.


 ప్రస్తుతం భారతదేశంలోని నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ భారత దేశ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేశారు.అదేంటో ఇప్పుడు చూద్దాం. "ప్రియమైన భారతీయ పౌరులారా.. ప్రస్తుతం ఇండియన్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ,నేవీ ఆఫీసర్స్ సిబ్బందికి సంబంధించిన విమానాలు,వాహనాలు,హెలిక్యాప్టర్లు ఒక దగ్గర నుండి మరో దగ్గరికి వెళ్తున్నప్పుడు భారతదేశ ప్రజలు ఎవరు కూడా తమ ఫోన్లలో ఈ వీడియోలు,ఫోటోలు తీయకండి. ఒకవేళ తీసినా కూడా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.


ఒకవేళ అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ వాళ్లకి తెలియకుండానే మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ పని చేయకండి" అంటూ ఇండియన్ ఆర్మీ భారతదేశ పౌరులను ఆ పని చేయకండి అంటూ విజ్ఞప్తి చేసింది. మరి మన దేశం కోసం ఎంతగానో పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి మనం కూడా వాళ్ళు చెప్పినట్లు విని ఫోటోలు,వీడియోలు తీయకుండా ఉండి వారికి సహాయం అందించిన వాళ్ళం అవుతాం.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: