భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాలను పెద్దగా ప్రోత్సహించదు. అలాగే ఉగ్రవాదాన్ని అస్సలు ప్రోత్సహించదు. కొన్ని సందర్భాలలో ఇతర దేశాలకు సంబంధించిన ఉగ్రవాదులు మనపై దాడి చేసిన దానిని ఎంతో కొంత సామరస్యంగానే పరిష్కరించేందుకు ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు మన దేశానికి సంబంధించిన ఎంతో మంది అమాయకపు ప్రజలను బలి తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక భారత ప్రభుత్వం అనేక మంది భారతీయులను అమాయకంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల పొట్టన పెట్టుకోవడంతో ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకోండి.
ఇలాంటి వారిని ఏమి చేయకుండా వదిలేస్తే భారతదేశంపై మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అని నేపథ్యంలో భారత ప్రభుత్వం రెండు రోజుల క్రితం అర్ధ రాత్రి ఒక్క సారిగా ఉగ్రవాద స్థాపరాలపై దాడి చేసింది. వారు తేరుకొనలేపే అనేక మంది ఉగ్రవాదుల ప్రాణాలను తీసేసింది. దానితో పాకిస్తాన్ మేము కూడా భారతదేశంపై దాడులు చేస్తాము అని ప్రకటించింది. అందులో భాగంగా పాక్ , భారతదేశంపై దాడులు చేయడానికి ప్రయత్నించిన మన ఆర్మీ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంది. దానితో భారతదేశానికి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ భారతదేశం ఎంతో వ్యూహాత్మకంగా పాకిస్థాన్ పై దాడులు చేస్తూ ఉండడంతో ఆ దేశం ఒక్క దెబ్బకు కుప్పకూలిపోతుంది. దానితో అనేక మంది భారతదేశం కనుక పాకిస్తాన్ ఉగ్రవాదులపై కాస్త కాంట్రాస్ట్రేషన్ పెడితే పాకిస్తాన్ కోల్పోవడం కూడా కష్టం అవుతుంది అని అభిప్రాయ పడుతున్నారు. మరి భారతదేశం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను హతం చేసే విషయంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళుతుంది అనే దానిపై భారత దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు కూడా చాలా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి.