ఏపీలో విషాదం.. జవాన్ మురళీ నాయక్‌ వీర మరణం

Veldandi Saikiran
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.   నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య  ఎవరు ఊహించని రీతిలో యుద్ధం జరుగుతోంది. అయితే ఇందులో పాకిస్తాన్ ను చిత్తు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇలాంటి నేపథ్యంలోనే దేశ రక్షణలో తెలుగు  జవాన్ మృతి చెందాడు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మురళి నాయక్ అనే జవాన్.... ఇండియా కోసం ప్రాణాలు అర్పించాడు.


 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. వీరుడిలా ప్రాణాలు అర్పించాడు  మురళి నాయక్. ఈ వీర జవాన్ మురళి నాయక్ ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది భారత ప్రభుత్వం. అయితే జవాన్ మురళి నాయక్ ( jawan murli nayak ) మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు చంద్రబాబు నాయుడు. దేశం కోసం వీరుడిలా మురళి నాయక్... పోరాడినట్లు పేర్కొన్నారు. ఆయన సేవలు అందరు గుర్తించాలని కోరారు చంద్రబాబు నాయుడు.

 తెలుగు కుర్రాడు, వీర జవాన్ మురళి నాయక్ మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్ షర్మిల కూడా స్పందించారు. అతని మృతికి సానుభూతి ప్రకటించారు. మురళి నాయక పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్ పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.



ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: