జీ7 దేశాల కీల‌క ప్ర‌క‌ట‌న‌.. పాక్‌కు మ‌రో షాక్‌..!

RAMAKRISHNA S.S.
పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటోంది. అమాయ‌క పౌరుల పేరు, మ‌తం అడిగి మ‌రీ చంప‌డాన్ని జీర్ణ‌యించుకోలేక‌పోయిన‌ భార‌త్.. పాక్ కు చుక్క‌లు చూపిస్తోంది. క‌ల‌లో కూడా ఊహించని రీతిలో మెరుపుదాడులు చేస్తూ పాక్ భవిష్యత్తును ప్ర‌మాదంలోకి నెట్టేసింది. ప‌నిగ‌ట్టుకుని యుద్ధానికి కాలు దువ్విన పాక్.. భారత్ కొడుతున్న దెబ్బ‌ల‌కు విలవిలాడుతోంది. ఇండియాను తిరిగి దెబ్బ తీయాల‌ని పాక్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అవి ఏ మాత్రం ఫ‌లించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆర్థికంగా న‌లిగిపోతున్న పాక్‌.. భార‌త్ తో యుద్ధానికి దిగి మ‌రింత ఆర్థిక సంక్షోభానికి ఆహ్వానం ప‌లికింది.


మ‌రోవైపు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఏ దేశం ముందుకు రావ‌డం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మ‌ధ్య‌లో దూర‌మంటూ ప్ర‌క‌టించింది. ఇలాంటి త‌రుణంలో తాజాగా పాక్ కు మ‌రో షాక్ త‌గిలింది. భార‌త్‌, పాక్ దేశాల మ‌ధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీయ‌డంతో.. జీ7 దేశాలు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన జీ7 దేశాలు.. పాకిస్థాన్‌ తీరును తీవ్రంగా తప్పు పట్టాయి.


ఈ మేర‌కు అమెరికా, కనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. .యుద్ధం విషయంలో భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలి అంటూ జీ7 దేశాలు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాయి. ఇరువైపులా ఉన్న పౌరుల భద్రత గురించి తాము ఆలోచిస్తున్నామ‌ని.. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని,  కూర్చుని శాంతియుతంగా ఇరుదేశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామని.. ఇదే విధంగా యుద్ధం కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని జీ7 దేశాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రకటనతో జీ7 దేశాలు పాకిస్థాన్‌ విధానాన్ని త‌ప్పుబ‌ట్ట‌డ‌మే కాక‌.. ప‌రోక్షంగా భార‌త్ కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లైంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: