`మహానాడు`లో నోరూరించే రుచులు.. మెనూ చూశారా..?
కడప జిల్లా సికె దిన్నే మండలం చెర్రోపల్లి, పప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇకపోతే మహానాడు ఫుడ్ మెనూ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం మహానాడుకు వచ్చే అతిథులకు పసందైన వంటకాలతో కడుపు నింపి ఇంటికి పంపడంలో టీడీపీ రాజీ పడిందే లేదు. ఈ విషయంలో ప్రత్యర్థులే ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా కడప మహానాడు వేడుకల్లో వంటకాలు అదిరిపోబోతున్నాయి.

వైరల్ అవుతున్న మెనూ ప్రకారం.. అల్పాహారంలో ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబార్, కారంపొడి, నెయి, టీ అందిస్తారు. అలాగే మధ్యాహ్న భోజనంలో కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, టమాటా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతీ, సొరకాయ పప్పు, చట్నీ, కారంపొడి, వైట్ రైస్, టొమాటో కాజు ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా కర్రీలు అందిస్తారు. నాన్‌వెజ్ కూడా ఉందండోయ్.. ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, ఐస్ క్రీమ్, కేక్, కూల్ డ్రింక్స్ ఇలా మొత్తం 22 రకాల ఐటమ్స్‌తో జర్మనీ వేదికగా మినీ మహానాడును నిర్వహించేందుకు అక్కడి టీడీపీ అభిమానులు రెడీ అయ్యారు.