దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ కీలకమైన పదవికి మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా తన పదవిని చేపట్టిన అనంతరం కొండా సురేఖ ఏదో ఒక వార్తతో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొండా సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేసింది. మంత్రులు ఎలాంటి పనులు చేయాలన్నా, పైల్స్ పైన సంతకం పెట్టాలన్న తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారు.
ఈ విషయం పైన తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మొత్తానికి కొండా సురేఖ కొన్ని నిజాలు మాట్లాడారని కేటీఆర్ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ నడుపుతున్న కమిషన్ సర్కార్ ఓపెన్ సీక్రెట్ అని అన్నారు. మంత్రులు కమిషన్ లేనిదే ఫైల్స్ పైన సంతకం చేయడం లేదని తోటి మంత్రి అన్నారు. ఆ మంత్రులు ఎవరో క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ఈ ఆరోపణల పైన మంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కొండా సురేఖ స్పందిస్తూ నేను మంత్రులు అన్నాను కానీ మా మంత్రులు అని చెప్పలేదు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న మంత్రులని అన్నానని సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు