సిందూర్: భారత్ దెబ్బ.. తుర్కియేకి ఏడాదికి.. రూ.700 కోట్ల నష్టం..?
తుర్కియే ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా ఎలాంటి సందడి కనిపించకపోవడంతో సుమారుగా 90 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆ దేశం కోల్పోయినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా భారత్ లో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ చాలా విపరీతంగా కొనసాగింది. ఇందులో భాగంగానే తుర్కియే ప్రాంతం చాలా ఆకర్షణీయంగా ఉండడంతో అక్కడ భవనాలు, కట్టడాలు కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉండడంతో ఎక్కువ జంటలు అక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అలా గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకే పెరుగుతూ ఉండేది. 2018లో కేవలం 13 జంటలు అక్కడ పెళ్లి చేసుకోగా.. 2024 కి వచ్చేసరికి 50 జంటలు వివాహం చేసుకున్నాయట.
ఇండియా నుంచి డెస్టినేషన్ కోసం తుర్కియే ప్రతి ఏటా కూడా ఆ దేశానికి 140 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తూ ఉండేది. ఈ విషయాన్ని అక్కడ వెడ్డింగ్ ప్లానర్ కెస్టోన్ ఉత్సవ్ సీనియర్ అధికారి నిఖిల్ తెలియజేశారు. ముఖ్యంగా అక్కడ ఒక్కో వివాహానికి అయ్యేటువంటి ఖర్చు 3 డాలర్లకు పైగానే ఉన్నదట. ఈ 3 డాలర్లు( భారత్ కరెన్సీ ప్రకారం 25 కోట్ల రూపాయలు).. ఇంకా ఆర్భాటంగా చేసుకుంటే 8 మిలియన్ డాలర్లని (అంటే 68 కోట్లు) అక్కడ ఉండే లోకల్ టూర్స్ కూడా మంచి లాభాలను అందించేదట.
అయితే భారత్లో బాయికాట్ తుర్కియే వంటివి మొదలవడంతో ఇప్పటికే 2000 మంది టూరిస్టులు ఆదేశానికి పర్యటనను సైతం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది తుర్కియేలో భారత్ నుంచి 30 జంటలు బుకింగ్ చేసుకోగా తాజాగా జరిగిన ఈ వివాదాల వల్ల 90 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లిందట..(ఇండియన్ కరెన్సీ ప్రకారం 770 కోట్లని) నిపుణులు తెలుపుతున్నారు).