వెండి తెరపై పవన్ కళ్యాణ్ .. కానీ సినిమా కాదు .. అసలు మేటర్ ఇదే..!

frame వెండి తెరపై పవన్ కళ్యాణ్ .. కానీ సినిమా కాదు .. అసలు మేటర్ ఇదే..!

Amruth kumar
పవన్ కళ్యాణ్ వెండి తెరపై చూడాలని చాలామంది అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు .. ఇక ఇప్పుడు పవన్ స్క్రీన్ పై వచ్చే టైం వచ్చేసింది అయితే అది సినిమా నుంచి కాదు .. పవన్ కళ్యాణ్ సినిమా  రావ‌డానికి ఇంకా చాలా సమయం ఉంది .  ప్రజా సమస్య పరిష్కారం లో భాగంగా పవన్ వెండితెరపైకి వస్తున్నారు .  ఒక గ్రామంలోని ప్రజలతో ముచ్చటంచి వాళ్ల సమస్యలను తెలుసుకునేందుకు ‘‘మన ఊరి కోసం మాటామంతీ’’ అనే స్క్రీన్ గ్రేవెన్స్ అనే ప్రోగ్రామ్ ను పవన్ ప్లాన్ చేశారు ..


ప్రజలతో మమేకమై వారి నుంచి ఫిర్యాదులు , వినతులు విన్నపాలు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు .. సినిమా థియేటర్లో స్క్రీన్ ద్వారా ప్రజలతో ముఖాముఖి జరుపబోతున్నారు .. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రావివలస గ్రామ ప్రజలతో పవన్ ముందుగా మాట్లాడనున్నారు .  అక్కడ ఉన్న ప్రజల్లో 290 మందిని స్థానిక భవాని థియేటర్‌కు తీసుకు వెళుతున్నారు .  అక్కడ పవన్ ప్రజల సమస్యలను వింటారు .  


అభిమానుల తాకిడి భద్రత కారణాలు దృష్ట్యా గ్రామీణ ప్రజలతో ప్రత్యక్ష పర్యటనల్లో పెద్దగా ఆయన వారితో మమేకమై మాట్లాడలేకపోతున్నారు .. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు .. మంగళగిరి లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు . ప్రధానంగా గ్రామాల్లో తాగు సాగునీరు , రోడ్లు , మూర్ఖు కాలువలు , ఉపాధి హామీ పథకం , పాఠశాల విద్య , నిరుద్యోగం , చెరువులు తదితర సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారు .. ఇతర ప్రాంతాల్లో కూడా సాగుతుంది సినిమా స్క్రీన్ పై పవన్ తో మాట్లాడటం వల్ల నేరుగా చూస్తామన్న భావన ప్రజల్లో కలుకుతుందని కారణంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం నుంచి వార్తలు వస్తున్నాయి .. ఇక మరి ఈ వినూత్న కార్యక్రమం తో డిప్యూటీ సీఎం ప్రజలకు మరింత దగ్గర అవటం ఖాయమని కూడా అంటున్నారు ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: