కమలహాసన్ కు రాజ్యసభ సీటు.. వివాదాల వేళ సాధ్యపడుతుందా?

frame కమలహాసన్ కు రాజ్యసభ సీటు.. వివాదాల వేళ సాధ్యపడుతుందా?

Divya
సినీ హీరో కమలహాసన్ నటనపరంగా బాగా సక్సెస్ అయ్యారు. అదే క్రేజ్ తోనే తానే సొంతంగా ఒక పార్టీని  MNM పేరుతో స్థాపించి 2019 లోక్ సభ ఎన్నికలలో అలాగే 2021 లో  తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కూడా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. కమలహాసన్ నిలబడిన సొంత నియోజకవర్గమే గెలుచుకోలేకపోయారు. అయితే 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికలలో డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు కమలహాసన్. ఆ సమయంలోనే ఒక ఒప్పందం కుదిరించుకున్నారట. అదేమిటంటే డిఎంకె నుంచి ఎం ఎన్ ఎం కు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు.. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అమలు చేసేలా కనిపిస్తోంది.


అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా డిఎంకే పార్టీ నుంచి రాజ్యసభకు కమలహాసన్ ని పంపించబోతున్నట్లు తెలుస్తోంది.. గత ఏడాది ఎన్నికలలో తమ పార్టీతో పొత్తు పెట్టుకున్న కమలహాసన్ కు  రాజ్యసభ సీటు ఇచ్చే విధంగా డీఎంకే పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అటు రాజకీయాలలో ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారుతున్నది. అంతేకాకుండా అప్పుడప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ తో కూడా కమలహాసన్ కలుస్తూ ఉన్నారు. గతంలో తాను పార్టీ స్థాపించినప్పుడు కూడా కమలహాసన్ అవినీతి రహిత పాలన, ప్రజా సమస్యలపైనే పోరాడుతానంటూ తన పార్టీ అజెండా కూడా అదేనంటూ తెలిపారు.


మరి కమలహాసన్ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభిమానులు భావిస్తున్నారు.. మరి రాజ్యసభ సీటుతో ఆయన ఎలా రాణిస్తారు తమిళనాడు ప్రజల సమస్యలను సైతం ఏ విధంగా పరిష్కారం చేస్తారు చూడాలి మరి. వచ్చే నెలలో కమలహాసన్ రాజ్యసభ సీట్లు లోకి డీఎంకే పార్టీ నుంచి వెళ్లబోతున్నట్లు సమాచారం. రాజ్యసభ అభ్యర్థులను కూడా వచ్చే నెలలోనే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాలను వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే కమలహాసన్  సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు  థగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళం నుండి కన్నడ పుట్టింది అని వివాదం సృష్టించారు. దీంతో బిజెపి నాయకులు కూడా కమలహాసన్ పై విమర్శలు గుప్పిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈయనకు రాజ్యసభ సీటు ప్రకటించడం పై తమిళ్ రాజకీయాలలో వేడి పెరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: