గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్ మధ్య బికర యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు తగ్గేదేలే అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇందులో రష్యా బలమైన దేశమైనా కానీ ఉక్రెయిన్ ఆ దేశం చేసే పనులకు ఎక్కడ కూడా తలోగ్గకుండా దాడులకు ప్రతి దాడులు చేస్తూ వస్తుంది. ఇదే తరుణంలో తాజాగా ఉక్రెయిన్ రష్యా లోపలికి ఎంట్రీ ఇచ్చి వారి వైమానిక విమానాలపై దాడి చేసి 56 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించింది. ఇదే తరుణంలో రష్యా కూడా దాదాపు 400లకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ మెయిన్ పట్టణాలపై దాడులు చేసి నష్టం కలిగించింది. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో లండన్ సమీపంలో యూరప్ దేశాలపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడేటట్టు కనిపిస్తోంది.
ఎందుకంటే వీళ్ళ యొక్క సబ్ మేరైన్ అక్కడి ప్రాంతాల్లో కనిపించడం ఆందోళనకు గురిచేస్తుంది. అత్యధిక సామర్థ్యం కలిగినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ ను యూరప్ వైపు తిప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. వారితో మాకు భయం ఉందంటూ బ్రిటన్ ప్రకటించడం చూస్తుంటే అర్థమవుతుంది ఇదే తరుణంలో పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రష్యాపై అనుబాంబు వేస్తే అలెర్ట్ చేయడానికి సిస్టం ఉంది. అమెరికాకి ఉన్నది. కానీ ఆ సిస్టం యూరప్ కి మాత్రం లేదని ఆయన తెలియజేశారు.
దీన్ని బట్టి చూస్తే మీ దేశంపై మేము అనుబంబు వేస్తే కనీసం సిగ్నల్స్ కూడా అందకుండా పోతాయని హెచ్చరికలు జారీ చేసినట్టే తెలుస్తోంది. మా దగ్గర ఉన్న న్యూక్లియర్స్ యూరోషిమా, నాగసాకిపై వేసిన న్యూక్లియర్స్ కంటే నాలుగు రెట్లు అత్యంత బలమైన ఉన్నాయని ప్రకటించాడు. ఈ విధంగా యుద్ధం యూరప్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఆపుతారా లేదంటే మరింత రెచ్చగొట్టి ఆ దేశాలు నాశనం అయ్యేదాకా చూస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.