ఏపీ: ఖాకీలకే సవాలుగా మారుతున్న అనంతపురం.. ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతలు లోపించాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందుకు నిదర్శనం ఇలాంటి హత్యలే అంటూ తెలియజేస్తున్నారు. అనంతపురంలో కేవలం 30 రోజులు గడవకముందే మూడు హత్యలు జరిగాయని దీంతో ఖాకిలకు అనంతపురం సవాల్ గా మారుతోందన్నట్లుగా కనిపిస్తోంది. గిరిజన యువతి తన్మయి కూడా అతి కీరతకంగా చంపేశారు. వీటికి తోడు అనంతపురంలోని ఒక గంజాయి బ్యాచ్ ఏకంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు పుష్ప సినిమాలోని డైలాగుతో "దమ్ముంటే పట్టుకోరా షేకావత్తు అంటూ చేసిన" వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో పుష్ప పాటలతో రీల్స్ చేస్తూ టాటూ చరణ్, పవన్ అనే యువకుడు వైరల్ గా చేశారు. దీంతో ఈనెల 18 న ఈ వీడియో చేయగా అనంతరం 21వ తేదీన పోలీసులు ఆ యువకుడిని పట్టుకొని మరి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వీరి మీద దొంగతనం కేసులే కాకుండా మనుషుల పైన దాడులు చేసిన కేసులు కూడా ఈ యువకుల మీద ఉన్నాయట. దీంతో పోలీసులకు సైతం అనంతపురంలోని ఒక వైపు కేసులు మరొకవైపు ఇలాంటి సంఘటనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ఎలాంటి అడ్డంకులు వేస్తారు చూడాలి మరి.