ఏపీ: స్మార్ట్ మీటర్ల పై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా.. కీలక ఆదేశాలు జారీ..!
ప్రజా ఆమోదం లేనిదే ఏ విషయంలో కూడా తాము ముందుకు వెళ్లం అంటూ తెలియజేశారు. ప్రజలు అంగీకారంతోనే స్మార్ట్ మీటర్లను సైతం బిగించాలని వెల్లడించారు.. దీన్నిబట్టి చూస్తూ ఉంటే స్మార్ట్ మీటర్ల అంశం పైన వెనక్కి తగ్గినట్టుగా ప్రభుత్వం కనిపిస్తోంది.కేవలం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని మంత్రి రవికుమార్ తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల పైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్య ఉందని వాటిని పరిష్కరించాలి అంటూ అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. అలాగే పీఎం సూర్య ఘర్ పైన ప్రజలకు అవగాహన కనిపించాలని తెలిపారు.
ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ అధికారులకు తెలియజేశారు విద్యుత్ శాఖ మంత్రి. ప్రస్తుతం వ్యాపార సంస్థలకు ,పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని వ్యవసాయానికి అసలు ఎప్పటికీ బిగించే ప్రసక్తి లేదని కేవలం సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పదివేల కనెక్షన్స్ పీఎం సూర్యఘర్ కనెక్షన్స్ ఇవ్వాలని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటివల్ల ప్రయోజనాలను తెలియజేయాలని తెలిపారు. స్మార్ట్ మీటర్ల పైన ఏదైనా తప్పుడు సమాచారం లేదా భయాలను తొలగించుకోండి అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు.