భారత్ పై సుంకాలు మరింత పెంచుతా. . వైరల్ అవుతున్న ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
రష్యా యుద్ధంలో ఎంతోమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినా భారత్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఈ సందర్భంగా ట్రంప్ కామెంట్లు చేశారు. ఈ కారణంగానే భారత్ పై గణనీయంగా సుంకాలు పెంచుతానని ఆయన చెప్పుకొచ్చారు. వలస వ్యవహారాల్లో సైతం భారత్ అమెరికాను మోసం చేస్తోందని వైట్ హౌస్ ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ అన్నారు. దీని వల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఎదురవుతున్న విమర్శలకు సంబంధించి భారత్ ధీటుగా బదులిచ్చింది. అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాల విషయంలో భారత్ మండిపడింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సా ఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది.
ఉక్రెయిన్ ఘర్షణ తర్వాత అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. దేశ ప్రయోజనాల పరిరక్షణ కొరకు అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా భారత్ పేర్కొంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు