"ఉత్తరాంధ్ర గగనతల కల నిజం భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఫాస్ట్ ట్రాక్‌లో!"
అదే సమయంలో VMRDA పరిధిలో 15 రహదారులు నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. రూ.390 కోట్లతో జరుగుతున్న ఈ రోడ్ల పనుల్లో 7 ప్రధాన మార్గాలు 2026 నాటికి రెడీ కానున్నాయి. ఎలివేటెడ్ కారిడార్లు – ట్రాఫిక్‌కు శాశ్వత సొల్యూషన్ .. విశాఖ ట్రాఫిక్ సమస్యకు గుడ్‌బై చెప్పేలా రూ.1,600 కోట్లతో 4 ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నారు. అగనంపూడి–లంకెలపాలెం, స్టీల్ ప్లాంట్–బీహెచ్‌ఈఎల్, సత్యం జంక్షన్–హనుమంతువాక, మధురవాడ–కొమ్మాది మార్గాల్లో ఈ ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఇవి పూర్తి అయితే విశాఖలో ట్రాఫిక్ స్ట్రెస్ లేకుండా సిటీ డ్రైవ్ అవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ గేట్‌వే .. మొత్తం 2,203 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ తొలి దశలోనే రూ.4,592 కోట్ల వ్యయం. 81,000 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, 22 ఏరో బ్రిడ్జ్‌లు, రెండు 3.8 కిమీ రన్‌వేలు – ఇవన్నీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో వస్తున్నాయి.
ఆరంభంలోనే 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం, భవిష్యత్‌లో 4 కోట్ల వరకు పెంచే ప్రణాళిక. ఇది కేవలం విమానాశ్రయం కాదు – ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ జోన్లతో ఒక మెగా హబ్ అవుతుంది. ఏరో సిటీ – ఉపాధి & వాణిజ్య కేంద్రం .. భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఏరో సిటీ, విడిభాగాల పరిశ్రమలు, హెల్త్‌కేర్, హోటల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందనున్నాయి. వేలాది మందికి నేరుగా – పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2030లో రెండో దశ .. \రెండో దశ పనులు 2030లో మొదలవుతాయి. అప్పుడు ఇది మరింత గ్లోబల్ స్టాండర్డ్స్ లో రూపుదిద్దుకుంటుంది. ఎయిర్ ట్రావెల్ మాత్రమే కాదు – పరిశ్రమలు, ఉద్యోగాలు, ట్రేడ్, టూరిజం అన్నింటికీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ – నూతన ద్వారం! ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తయ్యాక విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి – స్కై హై!