నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారమే వైసీపీ పని.. చంద్రబాబు కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పని అని అన్నారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్ట్స్ కొట్టుకుపోతున్నాయంటూ వైసీపీ టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలలో అసత్యాలు ప్రచారంలోకి వస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఊర్లు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.  రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారని కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పని చేయడం లేదని మరోసారి ప్రచారం చేశారని ఆయన తెలిపారు.  ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఒకసారి న్యూస్ వేశారని ఆయన తెలిపారు.  తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని  వైసీపీ యత్నిస్తోందని ఆయన తెలిపారు.

ఖండించని పక్షంలో  తప్పుడు ప్రచారాలనే నిజం అనే స్థాయికి తీసుకెళ్లారని మంచి గురించి మాత్రమే కాదని చెడు  గురించి చేసే ప్రచారాలను సైతం ఖండించాలని ఆయన తెలిపారు. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

నాయకుడు ఎప్పుడూ  ప్రజల్లో ఉండాలని  అసత్య ప్రచారాలను దృష్టిలో ఉంచుకుని మరింత క్రమశిక్షణతో మెలగాలని ఆయన వెల్లడించారు.  మీ మాటలు, చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చ్చిపెట్టే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు.  ఏ  ఒక్కరూ  వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని  పార్టీ కొరకు కష్టపడిన కార్యకర్తల కోసం  నామినేటెడ్  పదవులను భర్తీ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: