మనదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో తెలుసా..?

Pulgam Srinivas
మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మహిళలకు అనేక విషయాలలో ప్రముఖ ప్రాధాన్యతను ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో ఏదైనా ఎలక్షన్లు వచ్చాయి అంటే చాలు మహిళల కోసం కనీసం ఒకటి లేదా రెండు ప్రత్యేకమైన పథకాలను తమ మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు చేర్చుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా తెగ పాపులర్ అయిన మహిళా స్కీములలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను అనేక రాష్ట్రాలు ఇచ్చాయి. అందులో భాగంగా దాదాపు ఈ పథకం అమలు అవుతున్న  అన్ని రాష్ట్రాలలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతమైన రీతిలో సక్సెస్ అయింది.


మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొంత కాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరు అధికారం లోకి రాక ముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము గెలిస్తే తీసుకువస్తాము అని చెప్పారు. చెప్పిన విధంగానే తీసుకువచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ఇది అద్భుతమైన రీతిలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తాజాగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ప్రస్తుతం ఇది కూడా విజయవంతంగా కొనసాగుతుంది.


మరి మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంది అనుకుంటున్నారు ..? మన దేశంలో తెలంగాణ  , ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు , ఢిల్లీ , పంజాబ్ , kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">జమ్మూ అండ్ కాశ్మీర్ మన దేశంలోని ఇన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలలో అన్ని బస్సు సర్వీసులు ఉచితంగా మహిళలకు లభిస్తూ ఉంటే  , కొన్ని రాష్ట్రాలలో కొన్ని బస్సు సర్వీసులు మాత్రమే ఉచితంగా మహిళలకు లభిస్తున్నాయి. ఏదేమైనా కూడా మహిళలకు చాలా రాష్ట్రాలలో ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: