ఏపీ: వారందరికీ ఉచితంగా సెల్ ఫోన్స్..దరఖాస్తు ఎలా చేయాలంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రవణ, మౌన దివ్యాంగులకు ఒక గొప్ప కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతట అర్హత కలిగిన వారందరికీ ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్స్ ని అందించబోతున్నట్లు తెలియజేసింది. అర్హతల విషయానికి వస్తే 18 సంవత్సరాల వయసు కలిగిన వారు అయ్యి ఉండాలి. అలాగే విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యి ఉండాలని తెలిపారు. వీటికి తోడు సైన్ లాంగ్వేజి కూడా వచ్చి ఉండాలట.


ముఖ్యంగా వైకల్యం 40% పైబడిన వారు అర్హులు.. అలాగే ఆదాయం రూ .3 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు..www.apdascac.ap.gov.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ కార్డుతో పాటు SSC మార్కులు ఇంటర్ మార్కుల జాబితా, ఇతరత్రా కుల ధ్రువ పత్రాలు, వైకల్యం ధ్రువీకరణ పత్రంతో పాటు, వైట్ రేషన్ కార్డ్, ఆదాయ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోని సమర్పించాల్సి ఉంటుంది.


వీరితో పాటుగా..18 ఏళ్ల లోపు దివ్యాంగ బాల బాలికలకు సమగ్ర శిక్షణ పథకం ద్వారా కొన్ని అవసరమైన పరికరాలను కూడా అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని శిబిరాలను కూడా నిర్వహించబోతున్నారట. ఈనెల 26వ తేదీలోపు అన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డు ,రేషన్ కార్డుతో పాటు వైకల్యం ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందట.. అలాగే మూడు చక్రాల సైకిల్స్, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చూపు సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకించి కొన్ని కిట్టులు, వీల్ చైర్స్  పాటుగా మానసిక దివ్యాంగులకు కూడా అవసరమైన TLM కిట్లను కూడా అందించబోతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అటు దివ్యాంగులకు ప్రత్యేకించి ఇలాంటివి కేటాయించడంతో దివ్యాంగులు సైతం ఏపీ ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: