చంద్రబాబు @30: నేటి తరానికి రోల్ మోడల్ లీడర్..!

Divya
సరిగ్గా ఈరోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన మొదటిసారిగా సీఎం పదవిని చేపట్టారు చంద్రబాబు నాయుడు. తన 30 ఏళ్ల కాలంలో చంద్రబాబు అయితే సీఎం, లేకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలలో చంద్రబాబు హెడ్ లైన్ లోనే నిలుస్తూ ఉంటారు. మూడు దశాబ్ద కాలంలో చంద్రబాబు పేరు రాజకీయాలలో వినపడని రోజంటూ లేనేలేదు అలాంటి ముద్ర వేసుకున్నారు చంద్రబాబు.


చంద్రబాబు వచ్చాకే అభివృద్ధి మాట వినిపించింది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు గా మారిపోయారు. అభివృద్ధి అనే విషయంపై ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకునే వారు కాదు. పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే తాను ప్రజల్ని బాగు చేయడానికి ఏం చేయాలో అన్ని విషయాలను అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన తీసుకురావడం లాంటివి  చేశారు. అలాగే 20 ఏళ్ల క్రితమే ఐటి ఇండస్ట్రీని హైదరాబాదుకు తీసుకువచ్చారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఎగతాళి కూడా చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తాను అనుకున్న పద్ధతిలోనే ముందుకు వెళ్లేవారు.


సీఎంగా చంద్రబాబు నాయుడు తప్ప మరెవరు అధికారంలో ఉన్నా కూడా కులం , మతం ,ప్రాంతం లాంటి అంశాలతోనే రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు కేవలం అభివృద్ధి చూపించి ఇతర రాష్ట్రాలలోని వారు చూసి అభివృద్ధి అంటే ఇలా ఉండాలనేలా చేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు హైదరాబాదునే అభివృద్ధి చేశారని ప్రచారం కూడా వినిపించింది. అలాంటి హైదరాబాద్ కోసమే రాష్ట్ర విభజన కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు.. అమరావతి ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలలో కూడా అభివృద్ధి వైపు గానే అడుగులు వేస్తున్నారు.


ఎవరైనా ఏదైనా రంగంలో విజయం అందుకోవాలి అంటే గెలుపోటములు అనే లెక్కలు  పెట్టుకోకూడదు. అవకాశం అందినప్పుడల్లా పనిచేసుకుంటూ పోవాలి అలాంటి పని సీఎం చంద్రబాబు చేశారు. వాస్తవానికి  2014-19 లో విభజిత ఏపీని గాడిలో పెట్టిన తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని ఓకే వైపుగా తీసుకువెళ్లారు. ఇలా ఎన్నో చేసినప్పటికీ 2019లో ఘోరమైన ఫలితాలు చూసినప్పటికీ డీలా పడకుండా అన్నిటిని దిగమింగుకొని మరి తన పనిని మొదలుపెట్టారు. అలా 2024లో అఖండ మెజారిటీతో కూటమిలో గెలిచారు. అందుకే చంద్రబాబు నేటి తరానికి ఒక రోల్ మోడల్ లీడర్ అని చెబుతూ ఉంటారు. ఇష్టమైన విజయం కోసం చంద్రబాబు ఎంత కష్టాన్నయినా భరిస్తారు.చంద్రబాబు రాజకీయమే ఒక అద్భుతమైన పాఠం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: