"కడుపులో కత్తులు బయటికి నవ్వులు".. పెళ్లి క్యాన్సల్ తో స్టార్ట్..20 ఏళ్లుగా నడుస్తున్న కవిత-హరీష్ రావుల పగ..!

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కేసిఆర్ ఇంటి పంచాయితే.అదే కవిత హరీష్ రావుల మాటల యుద్ధం.. హరీష్ రావు సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేసింది. హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవినీతి పనులు చేశారని,ముఖ్యంగా కాళేశ్వరం అవినీతి పూర్తిగా హరీష్ రావుదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, హరీష్ రావు అభిమానులు అందరూ భగ్గుమన్నారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కూడా గరం అయ్యి తన కూతురని కూడా చూడకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అలా కవిత బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అవ్వడమే కాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది.అయితే ప్రస్తుతం కవిత రాజీనామా గురించి, కవిత కొత్త పార్టీ గురించి, అలాగే కవిత హరీష్ రావుల గొడవ గురించే టీవీలలో డిబేట్ లు నడుస్తున్నాయి.


 ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ టీవీ ఛానల్  డిబేట్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..హరీష్ రావు ని ఎప్పుడు హరీషన్నా అంటూ ఎంతో ప్రేమగా పిలిచే కవిత ఎందుకు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేసింది. అసలు కవితకు హరీష్ కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని జర్నలిస్టు ప్రశ్నించగా..నీటిపారుదల రంగ నిపుణులు వి. ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు హరీష్ రావు కవితల మధ్య ఈ వార్ ఇప్పటిది కాదు.పాలిటిక్స్ లోకి రాకముందు నుండే స్టార్ట్ అయింది.అలాగే కవిత మొదట ఎవరి ఇంటి కోడలు అయ్యేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆమె హరీష్ రావు ఇంటికి కోడలుగా వెళ్ళేది. హరీష్ రావు తమ్ముడి ని ఆమె పెళ్లి చేసుకునేది. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అలా బీఆర్ఎస్ పార్టీ పెట్టడం కంటే ముందే కవిత హరీష్ రావుల మధ్య గ్యాప్ ఏర్పడింది.


 ఎప్పటినుండో వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి.అయితే కవిత హరీష్ రావు మీద ఇలాగే నోరు పారేసుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే మాత్రం మేము కూడా నోరు విప్పాల్సి వస్తుంది.ఒకవేళ మేము నోరు విప్పి కవిత గురించి చెబితే మాత్రం ఆమె రేపు మీడియా ముందు తలెత్తుకొని కూడా తిరగలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నీటి పారుదల రంగ నిపుణులు ప్రకాష్.ప్రస్తుతం ఆయన ఆ ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు హరీష్ రావు కవితల పంచాయతీ ఈనాటిది కాదా.. 20 ఏళ్ల క్రితం నుండే వీరి మధ్య పంచాయతీ నడుస్తుందా.. కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మాత్రం నవ్వుకుంటున్నారా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: