ఏపీ: టిడిపి కూటమిలో వణుకు.. జగన్ కు జన నీరాజనాలు.!

Pandrala Sravanthi

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఒకవైపు ఉంటే  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉంటుంది.. 2024 ఎలక్షన్స్ లో  వీరంతా జట్టు కట్టి జగన్ ను దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జనం జగన్ ను మరిచారని, అందుకే ఆయనకు ఆ సీట్లు వచ్చాయని తెలియజేశారు.. నిజంగానే జగన్ ను జనం మరిచిపోయారా.. జగన్ ను మర్చిపోతే ఆయన బయట అడుగుపెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు  అనే వివరాలు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇందులో 11 జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిస్తే మిగతావన్నీ టిడిపి,బిజెపి, జనసేన పార్టీ లు గెలిచాయి. ఇందులో చాలా సీట్లు కొద్దిపాటి మెజారిటీతోనే  గెలిచాయని చెప్పవచ్చు. ఒకవేళ జనసేన బిజెపి ఎవరికి వారే పోటీ చేస్తే అక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు.


 కానీ వారంతా కలిసి జట్టు కట్టడం వల్లే జగన్ అక్కడ ఓటమిపాలయ్యారు. అలాంటి జగన్ ను ప్రజలు మొత్తం మర్చిపోయారని టిడిపి కూటమి నాయకులు అంటున్న ఈ సమయంలో తాజాగా జగన్ ర్యాలీకి వచ్చిన రెస్పాన్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. జగన్ మొత్తం 60 కిలోమీటర్లు  రోడ్ షో చేసేసారు. ఈ 60 కిలోమీటర్లు ఎక్కడికక్కడ జనం ఎగబడి మరీ జగన్ కోసం ఎదురుచూశారు. జగన్ వచ్చినప్పుడు ప్రజలకు బందోబస్తు ఏర్పాటు చేయడం మానేసి జగన్ వెనకాల ఎవరు రాకుండా ఆపేడానికే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధంగా జనాలు చీమల లాగా పుట్లకొద్ది వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి కి వెళ్లడానికి కొన్ని గంటల సమయం పట్టింది. నిజానికి జగన్ కాన్వాయ్ స్పీడ్ కు కనీసం 35 నుంచి 40 నిమిషాల్లో అనకాపల్లి చేరుకోవాలి. కానీ 11 గంటలకు మొదలైన జగన్ 5 గంటలకి అనకాపల్లి చేరుకున్నారు.


ఈ లెక్కన జనం ఆయనను అడుగడుగునా ఎంత  ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఎన్ ఈడి జంక్షన్,వేపగుంట, పెందుర్తి ,పుత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్ వీటిని టచ్ చేసుకుంటూ జగన్ వెళ్లారు. భారీ వర్షం లో కూడా జనం రోడ్లపై నిలబడి జగన్ పై పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు. దీన్నిబట్టి చూస్తే జగన్ కు ప్రజాదారణ లేదని చంద్రబాబు అన్న మాటల్లో ఎలాంటి నిజాలు లేదని అర్థం చేసుకోవచ్చు. జగన్ పై రోజు రోజుకు ప్రేమ పెరుగుతోంది.. దీన్ని బట్టి చూస్తే మాత్రం తప్పకుండా టిడిపి కూటమి ప్రభుత్వంపై జనాలకు కాస్త విరక్తి చెందినట్టే అనిపిస్తోంది. ఆయన యాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి టిడిపి కూటమినేతలంతా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన జనాలు ఆగలేదు. మొత్తానికి జగన్ యాత్రను చూసినటువంటి అధికార పార్టీ నాయకులకు వణుకు పుట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: