బీహార్ మొదటి దశ ఎన్నికలపై.. PK ఏమన్నారంటే..?
రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జనతాదళ్ (U) రెండిటి నుంచి కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. నవంబర్ 14వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు విషయంలో ఇది బయటపడుతుందని నవంబర్ 14 చరిత్రలో నిలిచిపోతుందంటూ తెలియజేశారు ప్రశాంత్ కిషోర్. ఈ స్థాయిలో పోలింగ్ జరుగుతుందని ఏ పార్టీ వాళ్లు కూడా ఊహించలేకపోయారు. సుమారుగా 2 కోట్ల 10 లక్షలకు పైగా మంది ఓటు హక్కును వినియోగించారు. ఇదంతా కూడా మార్పు కోసమే అంటూ తెలిపారు.
ముఖ్యంగా వలస కార్మికులే పెద్ద సంఖ్యలో ఓటు వేశారని 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో దాదాపుగా 7.06 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని వారందరూ కూడా ఉద్యోగాల కోసం బీహార్ రాష్ట్రాన్ని వీడి మరి ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లారని.. అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకు జరిగేటటువంటి ఛాత్ పండుగకు వచ్చారు. పోలింగ్ రోజు వరకు బీహార్ లోనే ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలియజేశారు ప్రశాంత్ కిషోర్. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరుగుతుందని ఆ తర్వాత 14వ తేదీన ఫలితాలు వెలుపడతాయని తెలియజేశారు. అటు ఎన్డీఏ కూటమి, మహాఘాట్ బంధన్ కూటమి ఎవరికి వారు దిమాని తెలియజేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారన్నది తెలియాలి అంటే నవంబర్ 14వ తేదీ వరకు ఆగల్సిందే