జనసేనకు ఇక అక్కడ చిక్కులే.. పవన్ ఆశలు వదిలేసుకున్నాడా..?
ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం బలంగా ఉందని చాలామంది భావిస్తున్నారు. బీజేపీ - జనసేన పొత్తు మళ్లీ ఉంటే .. జనసేన కొన్ని డివిజన్లలో పోటీ చేస్తే కొన్ని ప్రాంతాల్లో ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో లేకపోవడంతో, ఆంధ్ర ఓటర్లు లేదా ఆ వర్గాలకు ప్రత్యామ్నాయ నేతగా పవన్ ఉండే అవకాశం విస్తరించింది. జనసేన నాయకులు కూడా తెలంగాణలో అవకాశాలను ఆశిస్తున్నారు. పవన్ కూడా ఆ నాయకులకు భవిష్యత్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇలాంటి కీలక సమయంలోనే పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలు బీఆర్ఎస్ - కాంగ్రెస్‌కు అనుకోని రాజకీయ అవకాశంగా మారాయి.
ఈ రెండు పార్టీలు పవన్ ప్రభావాన్ని ముందుగానే తగ్గించడంతో పాటు ఫ్యూచర్‌లోనూ జనసేన–బీజేపీ సమీకరణాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా వెళతారు అనడంలో సందేహం లేదు. ఇకపై పవన్ తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ఈ వ్యాఖ్యలను టార్గెట్‌గా చేసుకుని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. అందువల్ల పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అక్కడ జనసేన బలోపేతం కావాలంటే ప్రజా సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవడం.. వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండటం.. వ్యూహాత్మక పొత్తులను సరిగ్గా నడపడం అత్యంత కీలకం.