సీఎం బాబు సీక్రెట్ సర్వే షాక్: 37 మంది ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్!

Amruth kumar
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఏమాత్రం కనికరం చూపడం లేదు! కేవలం ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా, పార్టీని పటిష్టం చేసే బాధ్యతను కూడా తానే భుజాన వేసుకున్న ఆయన, ఎమ్మెల్యేల పనితీరుపై ఉక్కుపాదం మోపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన కేబినెట్ సమావేశాలు, పార్టీ మీటింగ్‌లలో పదే పదే హెచ్చరించినా మార్పు రాలేదనే నివేదికలు రావడంతో, ఆయన ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు! 37 మందిపై వేటు భయం! .. సీఎం చంద్రబాబు ఏకంగా నాలుగైదు రహస్య సర్వేల ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి సమాచారాన్ని సేకరించారు. ఆ నివేదికల సారాంశం చూసి పార్టీ అధిష్టానం షాక్‌కు గురైంది. మొత్తం ఎమ్మెల్యేలలో ఏకంగా 37 మంది పనితీరు ఏమాత్రం సరిగా లేదని, వారు నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది!

 

ఇక ఈ 37 మంది పేర్లతో కూడిన 'రెడ్ లిస్ట్' ఇప్పుడు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇకపై ఈ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు రాబట్టాలని పార్టీ నాయకత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నిరంతర సమీక్షలు, ముఖాముఖి సమావేశాల ద్వారా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగుపడాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. లోక్‌సభ కమిటీల ఫైనల్ వార్నింగ్! .. ఎమ్మెల్యేల పనితీరుతో పాటు, పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక అంశంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గ కమిటీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా బ్యాక్‌ ఆఫీస్‌ ప్రతినిధులతో రెండున్నర గంటల పాటు భేటీ అయిన సీఎం, కమిటీ సభ్యుల తుది జాబితాను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.



'త్రిసభ్య కమిటీని వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించండి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ, వారం రోజుల్లోగా లోక్‌సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితాను పూర్తి చేయండి!' అని స్ట్రిక్ట్ డెడ్‌లైన్ విధించారు. లోక్‌సభ కమిటీ సభ్యులు పూర్తి అయితేనే క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం అవుతుంది. పనితీరు మారాల్సిందే! .. చంద్రబాబు సర్వే కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అల్టిమేటం! ఈ 37 మంది ఎమ్మెల్యేలు ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కడం కష్టం అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉండాలి, కేడర్‌కు అందుబాటులో ఉండాలి. లేకపోతే... 'బాస్' కఠిన నిర్ణయం తప్పదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: