దూసుకొస్తున్న మార్బర్గ్ వైరస్..మరణాల రేటు 88%.. లక్షణాలివే..?

Divya
దక్షిణ ఇథియోపియా ప్రాంతంలో తాజాగా మార్బర్గ్  వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. డిసెంబర్ 3 నాటికి మొత్తం 13 మందిలో వైరస్ మొదటి లక్షణాలు గుర్తించినప్పటికీ  ఇందులో 8 మంది తీవ్ర పరిస్థితులలో మరణించారని అక్కడ వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సదుపాయాలు పరిమితంగా ఉన్నందువల్ల ఈ వైరస్ వ్యాప్తి నివారించడం పెద్ద సవాల్గా మారిందని అక్కడ వైద్యశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.



మానవులకు అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులలో ఈ వ్యాధి కూడా ఒకటిగా పరిగణించబడిందని WHO సంస్థ తెలియజేసింది ఈ వైరస్ వల్ల మరణాల రేటు ఏకంగా 88% ఉంటుంది. ఈ వైరస్ కూడా సాధారణ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్, ఇతర జంతువులతో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుందట. ఇథియోఫియా లాంటి ఆఫ్రికన్ దేశాలలో కూడా ఈ వైరస్ గతంలో రావడంతో పెద్ద ఆరోగ్య సంక్షోభాలకు గురిచేసింది. అయితే ఈ వైరస్ ని గుర్తించడానికి అక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయిస్తోంది..


ప్రస్తుతం మార్బర్గ్ వైరస్ కి వ్యాక్సిన్, ప్రత్యేక చికిత్స వంటివి అందుబాటులో లేవని, అందుకే ఈ వైరస్ పరిస్థితి మరింత ఎక్కువగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట సాధారణ ఫ్లూ లాగా కనిపించిన, కానీ ఆ తర్వాత దీని తీవ్రత ఎక్కువ అవుతుందని ప్రజలు ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అంటూ తెలియజేస్తున్నారు.  ఇథియోపియాలో ఈ వైరస్ రోజు రోజుకి ఎక్కువగా ప్రభావం చూపడంతో జాగ్రత్తలు పాటించాలని అక్కడివారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: