ఏపీ: మినిస్టర్ నాగబాబు.. మంత్రి పదవికి అడ్డుపడుతోంది ఎవరు..?

Divya
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి అనేది అందని ద్రాక్షలాగే మారిపోయింది. 2024 డిసెంబర్ 9న సీఎం చంద్రబాబు ఎన్డీఏలో కూటమిలో భాగంగా నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామంటూ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసి ఇప్పటికి ఒక ఏడాది కావస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంపై మళ్ళీ ఏ విధమైనటువంటి వార్త వినిపించలేదు.ఈ ఏడాది మార్చి 30వ తేదీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఏడు నెలల నుంచి నాగబాబు చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.



మంత్రి పదవి చేపట్టాలి అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ సరిపోతుంది. అలా చూసుకుంటే ఆ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఎందుకు ?నాగబాబు మంత్రి పదవి మాత్రం రాలేదని చర్చ జనసేన నేతలలో, కార్యకర్తలలో ప్రశ్నార్థకంగానే మిగిలింది?. కానీ ఇక్కడ టిడిపి, బిజెపి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని వినిపిస్తోంది. మరి అడ్డంకి ఏంటి అంటే సామాజిక పరమైన కూర్పే అని అది కూడా జనసేనలోనే ఉందని వినిపిస్తున్నాయి.


జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓకే అంటే మంత్రి పదవి లభిస్తుంది. అయితే ఈ విషయంపై పవన్ కూడా నాగబాబుకి పదవి ఇవ్వడం ఆనందమే అయినా, పార్టీ అధినేతగా రాజకీయ ప్రాంతీయ సామాజిక సమి కారణాల విషయాలపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు ఉంటే అందులో ఇద్దరు(కాపు ) సామాజిక వర్గానికి చెందినవారు  ఉన్నారని, దీంతో మరో పదవి అదే సామాజిక వర్గానికి ఇస్తే అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని ఆలోచిస్తున్నారట. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఆలస్యం ఆవుతోందనే విధంగా వినిపిస్తున్నాయి. 2026లో కూటమిలో మార్పులు చేర్పులు ఉంటాయని అలాగే మంత్రివర్గంలో కూడా ఉంటాయని..అప్పుడు జనసేన పార్టీలో కూడా మంత్రి పదవుల పైన మార్పు జరిగితే కచ్చితంగా నాగబాబుకు స్థానం దక్కుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: