ఏపీ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తో పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!
గ్రామ శుభ్రతకు పనిచేసే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే సహించనని.. సర్పంచుల ప్రధాన బాధ్యత కూడా గ్రామాలు శుభ్రంగా ఉంచడమే కదా అంటూ తెలిపారు. చాలామంది సర్పంచులు గ్రామ శుభ్రత చేసే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. వారి జీతాలను సైతం అందించే అధికారం ఆ గ్రామ సెక్రటరీకి మార్చే ఆలోచన చేస్తామంటూ తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించేలా రూపొందించడమే ఈ మాటా మంతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటూ తెలియజేశారు. అలాగే సోమిత్వ పథకం సర్వే వద్దని ఎవరైనా ఎమ్మెల్యే చెబితే మాకు చెప్పండి అంటూ తెలిపారు.
ప్రతిచోట కూడా సోమిత్వ పథకం సర్వే చేయించాలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం పైన కూడా ఆలోచిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. సుమారుగా 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలా రాబోయే క్యాబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని, సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మరి దృష్టి పెట్టారు.