జనసేన: నాగబాబు సంచలన నిర్ణయం..పోటీ చేయనంటూ..?

Divya
జనసేన పార్టీలో కీలకమైన నేతగా ఉన్న నాగబాబు, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతలతో సమావేశం అవుతూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . తాను ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసేది లేదంటూ తాజాగా ప్రకటించారు. కేవలం జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పనిచేస్తానంటూ తెలియజేశారు నాగబాబు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తరచు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి సైతం నాగబాబు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.


నాగబాబు జనసేన పార్టీ కోసమే గత కొన్నేళ్లుగా పనిచేశారు. గత ఎన్నికలలో కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయవలసి ఉన్నప్పటికీ కూటమిలో భాగంగా ఆ సీటును బిజెపి పార్టీ(సీఎం రమేష్)కి ఇచ్చేశారు. అనంతరం నాగబాబులు మంత్రి చేస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. దీంతో నాగబాబు ఎమ్మెల్సీగా కూడా అయ్యారు. త్వరలోనే మంత్రిగా కూడా బాధ్యతలు చేపడతారని వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వల్లే ఇది ఆలస్యం అవుతుందని సమాచారం. ఇటీవల నాగబాబు ఆరోగ్య కారణాలవల్ల పెద్దగా యాక్టివ్ గా కనిపించలేకపోతున్నారని అందుకే మంత్రి పదవి పైన ఒత్తిడి తీసుకురావడం లేదనే విధంగా వినిపిస్తున్నాయి.



గత కొన్ని నెలలుగా నాగబాబు ఏ ప్రాంతంలో పార్టీ పైన దృష్టి పెడితే అక్కడి నుంచే పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ఉండడంతో ఈ విషయం కూటమిలో సమస్యగా మారుతోందని, గ్రహించి తన మీద వస్తున్న రూమర్స్ అన్నిటికీ ఈ విధంగా చెక్ పెట్టారు. మరి వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో అన్ని అనుకూలంగా ఉండి సీట్లు పార్టీకి ఎక్కువగా లభిస్తే పోటీ చేయడానికి సిద్ధపడతారేమో చూడాలి మరి. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన అటు జనసేన నేతలు ,కార్యకర్తలు , అభిమానులు నిరాశను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: