నారా బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసిందిగా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు తన పదవీకాలం ముగిసే నాటికి మొత్తం మీద 19 సంవత్సరాల సీఎంగా పనిచేసిన ఘనత అందుకుంటారు. అలా దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతలలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. సిక్కిం రాష్ట్ర సీఎంగా వ్యవహరించిన పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఒడిస్సా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల 99 రోజులు, ఆ తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు,మిజోరం ముఖ్యమంత్రి లాల్ థన్హౌవ్లా, అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా గెగాంగ్ అపాంగ్ లాంటి వారు ఎక్కువ కాలం పని చేశారు.


వీరిద్దరి తరువాతే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో చంద్రబాబు ఒకరిగా నిలిచారు. ఇక ఈయన కోడలు నారా బ్రాహ్మణి గురించి చెప్పాల్సిన పనిలేదు. నారా లోకేష్ భార్యగా ఉంటూ అన్ని విధాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్ సంబంధిత వ్యాపారాల విషయంలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. అయితే ఎప్పుడూ కూడా రాజకీయాలలో తల దూర్చడం వంటివి చేయదు. 2024 ఎన్నికలలో మాత్రం టిడిపి పార్టీకి సపోర్టుగా ప్రచారం చేసింది.దీంతో గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీ పైన వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా బ్రాహ్మణి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.


ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పైన మిమ్మల్ని రాజకీయాలలోకి రావాలని కోరితే ఏమంటారు అని అడగగా? అందుకు సమాధానంగా కచ్చితంగా నాకు ఆ రంగం ఆసక్తి లేదని తెలియజేసింది..తాను పాడిరంగంలోనే లక్షలాదిమంది మహిళా రైతులు , కోట్లాదిమంది వినియోగించే వాటికి ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాటిని ఎందుకు వదులుకోవాలి ఆరోగ్యం, పోషక రంగాలపైన నాకు చిన్నప్పటినుంచే  ఆసక్తి ఉంది..ఈ రంగాలలో  ఉండడం చాలా ఇష్టం, అందుకే వాటినే చేస్తానంటూ సమాధానంతో  దాటేసింది నారా బ్రాహ్మణి. చంద్రబాబు కూడా తన తదుపరి వారసత్వం కింద నారా లోకేష్ ని సీఎంగా చూడాలని అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు టిడిపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: