ఉత్తరాంధ్ర 'ఆకాశ' కల: భోగాపురం ఎయిర్పోర్ట్ 'మాస్' రికార్డ్!
ఆ నెలలో ఈ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగురుతుందని ప్రకటించారు. అయితే, విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తి అవుతుండడంతో... డెడ్‌లైన్ కంటే ముందే, అంటే 2026 మే నెలలోనే తొలి విమానం ఎగురుతుందని సంచలన న్యూస్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అభివృద్ధికి ఆకాశమే హద్దు! .. భోగాపురం నుంచి తొలి విమానం ఎగరడం తోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి సైతం పరుగులు తీస్తుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే, అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. ఈ అంతర్జాతీయ విమానయాన రంగం ద్వారా ఉత్తరాంధ్ర బయటి ప్రపంచంతో మరింతగా కనెక్ట్ అవుతుందని, అంతర్జాతీయ స్థాయి విమానాల రాకపోకలతో ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుందని లెక్కలేస్తున్నారు. మరోవైపు, ఐటీ పరిశ్రమలు, టూరిజం డెవలప్మెంట్, ఇతర పరిశ్రమల రాకతో ఇప్పటికే ఉత్తరాంధ్రకు ప్రాముఖ్యత పెరిగింది.
ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ కూడా కుదిరిన పక్షంలో... ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆకాశమే హద్దుగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. స్పీడ్ వెనుక 'ఎన్డీయే' పవర్! .. సాధారణంగా ప్రాజెక్టులు చెప్పిన సమయానికి కంటే ఆలస్యంగా పూర్తి అవుతాయి. కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం అనుకున్న దాని కంటే వేగంగా, నెల ముందుగానే ఓపెనింగ్‌కు నోచుకోవడం రికార్డుగా చూస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండడం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు కావడం వల్లే ఇది సాధ్యపడిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, ఉత్తరాంధ్ర ఆశలు, కలలు, ఆకాంక్షలను మోసుకుంటూ తొలి విమానం 2026 మే నెలలోనే ఎగరడం... ఈ ప్రాంత ప్రజలకు స్వీట్ న్యూస్!