కర్నూలు మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. అసలేం జరిగిందంటే?
కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడం సంచలనం అవుతోంది. హఫీజ్ ఖాన్ తనపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ ఆరోపణలు చేయడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధిత మహిళ చెబుతున్నారు. వాస్తవాలను బయటపెట్టాలని ప్రయత్నించడంతో నాపై హత్యాయత్నం కూడా చేశారని ఆమె వెల్లడించారు.
బాధిత మహిళ ఇప్పటికే మహిళా కమిషన్ ను ఆశ్రయించగా కర్నూలు పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. తాజాగా ఈ మహిళ ఎస్సీ కమిషన్ ను కూడా ఆశ్రయించడం కొసమెరుపు. ఎస్సీ కమిషన్ కార్యదర్శి చిన్నరాముడు మహిళ ఫిర్యాదు విషయంలో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది.
కార్పొరేటర్ టికెట్ కోసం తాను హఫీజ్ ఖాన్ ను ఆశ్రయించగా హఫీజ్ ఖాన్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ మొత్తం ఇస్తే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని చెప్పారని ఆమె వెల్లడించారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 3.7 కోట్ల రూపాయలకు బేరం కుదిరిందని టికెట్ కూడా ఇప్పించకుండా మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణల విషయంలో ఎస్సి కమిషన్ స్పందిస్తూ ఆయా అంశాల గురించి స్పందిస్తూ ఆయా అంశాల గురించి సమగ్ర దర్యాప్తు చేసి ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆమె ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని బాధిత మహిళ పేర్కొన్నారు.
బాధిత మహిళ ఫ్యాషన్ డిజైనర్ అని సమాచారం అందుతోంది. ఈ వివాదం విషయంలో హఫీజ్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కర్నూలు మాజీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడంపై ఇలాంటి విమర్శలు వ్యక్తం కావడం హాట్ టాపిక్ అవుతోంది. బాధిత మహిళ వెల్లడించిన విషయాలు ఒకింత సంచలనం అవుతున్నాయి.