బురద జల్లేవారికి ‘డేంజర్ బెల్స్’! టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Amruth kumar
నేటి రాజకీయ నాయకులలో పారదర్శకత, జవాబుదారీతనం దొరకడం కష్టం. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం తాను ఇందుకు భిన్నం అంటున్నారు. అంతేకాదు, "తప్పు చేస్తే కొట్టండి" అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి! ఈ వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలు, లేదంటే బురదజల్లే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్గా విశ్లేషిస్తున్నారు. బురద జల్లేవారికి 'డేంజర్ బెల్స్స‌! ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ... తాను పార్టీలో ఎవరికీ చెడు చేయలేదని, తన వల్ల ఎవరికీ చెడు జరగలేదని స్పష్టం చేశారు.


 ఏదైనా సమస్య ఉంటే, నిజమైన పాయింట్ ఉంటే తన దగ్గరకు తీసుకువస్తే మాట్లాడతానని చెప్పారు. అయితే, కొంతమంది తమపై కావాలని లేనిపోని అభాండాలు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆయన ఇక్కడితో ఆగకుండా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి: "అలా లేనిపోని అభాండాలు వేసి, దుస్తులు కాల్చి మీద వేసేవారికి దేహశుద్ధి చేయాల్సిందే!  "వారిని సెంటర్లో పడేసి కొట్టండి!" అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాస్ పిలుపునిచ్చారు. పార్టీ గురించిగానీ, వ్యక్తుల గురించిగానీ తప్పుగా మాట్లాడే వారిని కొట్టాలని, అలా దేహశుద్ధి చేసిన వారికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.


అసంతృప్తి వెనుక అసలు కథ ఏమిటి? ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఏ సందర్భంగా ఇంత 'మాస్ యాటిట్యూడ్' చూపించి, ఈ సంచలన కామెంట్లు చేశారో స్పష్టంగా తెలియకపోయినా, ఆయనపై బురదజల్లాలని ప్రయత్నించే వారికి మాత్రం ఇది డైరెక్ట్ వార్నింగ్ అని అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు నడుస్తున్నాయనే గుసగుసలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అణచివేసేందుకు, కార్యకర్తలకు 'మాస్ బూస్టింగ్' ఇచ్చేందుకే ప్రవీణ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఎమ్మెల్యే చేసిన ఈ షాకింగ్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ... రాజకీయ వేడిని పెంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: