సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. సచివాలయాల పేర్లు మార్పు..!

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పథకాలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అందుకు తగ్గట్టుగా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అలాగే ఒకవైపు అన్ని విధాల ఏపీని అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల పైన దృష్టి పెట్టారు. ఇప్పుడు తాజాగా సచివాలయ వ్యవస్థలో మార్పులు చేసినట్లుగా తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ రోజున జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో గ్రామ ,వార్డు సచివాలయాల ద్వారా సేవల అంశం పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే వాట్సప్ గవర్నర్స్ వినియోగం పైన సచివాలయాల ద్వారా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు.


అలాగే సచివాలయాల పేర్లు మార్పు పైన కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. రెండు రోజుల కలెక్టర్ సదస్సులో భాగంగా సచివాలయ వ్యవస్థ పైన చర్చించగా సచివాలయాల శాఖ పేరు మార్చేల నిర్ణయం తీసుకున్నారు.. ప్రస్తుత వార్డు సచివాలయ శాఖను ఇకనుంచి" స్వర్ణగ్రామం" శాఖగా మార్చబోతున్నట్లు నిర్ణయించారు. అలాగే గ్రామ సచివాలయాల పేరుని "విజన్ యూనిట్"  గా మార్చబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ యూనిట్లు ఇకమీదట ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందించేలా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు చంద్రబాబు.


రాష్ట్రంలో ప్రస్తుతం 13,326 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయని ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే తీసుకువచ్చామని అది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047 కు అనుగుణంగానే ఉంటుందంటూ తెలియజేశారు సీఎం చంద్రబాబు. అలాగే సచివాలయాల నుంచి అందుతున్న సేవలను కూడా కలెక్టర్లను మానిటరింగ్ చేస్తూ ఉండాలని సూచనలు ఇచ్చారు. వాలంటరీ వ్యవస్థ లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు అన్నిటిని నిర్వహిస్తున్నారు. పెన్షన్ పంపిణీ తో పాటుగా, మరికొన్ని సేవలకు  సచివాలయ ఉద్యోగుల ద్వారానే వినియోగించుకుంటున్నారు. మరి సచివాలయాల పేరు మార్పు పై వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: