ఏపీ: సంక్షేమ పథకాలపై గుడ్ న్యూస్.. క్యాలెండర్ ఎప్పుడంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో భాగంగా కూటమి గెలవడానికి ముఖ్య కారణం సూపర్ సిక్స్ హామీలే.. అయితే ఇందులో కొన్ని హామీలను నెరవేర్చకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ పథకాల నగదుకు సంబంధించి ఏ నెలలో వస్తాయనే విషయాన్ని లబ్ధిదారుల కోసం ఒక క్యాలెండర్ రూపంలో విడుదల చేయబోతున్నారు. ప్రజలు మాత్రం పథకాల డబ్బులు ఎప్పుడు పడతాయని వేచి చూస్తూ టెన్షన్ పడాల్సిన పనిలేదని, పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందులో పొందుపరుస్తామని, ఏ నెలలో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ద్వారా విడుదల చేస్తామని తెలుపుతున్నారు.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సంక్షేమ క్యాలెండర్ ను సైతం విడుదల చేయబోతున్నారు. పథకాలకు కావలసిన నిధులను ముందుగానే సిద్ధం చేసుకోవడానికి ప్రభుత్వానికి సమయం దొరుకుతుందని, లబ్ధిదారులు కూడా ఈ సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఆర్థిక ప్రణాళికను ప్లాన్ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ఇటీవల సచివాలయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి అందులో తెలియజేశారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సంక్షేమ క్యాలెండర్లను కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేశారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమలు చేయాలని, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తామని దీనిపైన ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు సూచించారు. గత వైసిపి హయాంలో  ఇలాంటి సంక్షేమ క్యాలెండర్ ను కూడా అమలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాంటి తరహాలోనే సంక్షేమ క్యాలెండర్ ని విడుదల చేయబోతోంది. సూపర్ సిక్స్ హామీలలో అమలు కానీ పథకాలకు సంబంధించి వాటిని పొందుపరుస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: