జగన్ పాలిటిక్స్: సంతకాలు అయ్యాయి.. నెక్ట్స్ ఏంటి..?
రెండు దఫాలుగా చేసిన ఈ కార్యక్రమాల అనంతరం.. కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్కు సమర్పించారు. దీంతో ఒకక్రతువు పూర్తయింది. ఇప్పుడు గవర్నర్ మాత్రం ఏం చేస్తారు? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కేం ద్రమే ప్రైవేటు రంగాన్నిప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి అనేక రంగాల వరకు పెట్టుబడుల విషయంలో ప్రైవేటుకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కూడా ఈ విషయంపై పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు.
అయితే.. వైసీపీ ఈ విషయంలో ప్రజల్లో చర్చను తీసుకురావడంలో సక్సెస్ అయింది. గతంలో 2002-03 మధ్య విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎలా అయితే.. చంద్రబాబు సర్కారుపై ఉద్యమం లేచిందో.. అదే తరహాలో ఇప్పుడు ఉద్యమం తీసుకురావడంలో జగన్ ఒకింత సక్సెస్ అయ్యారనే అంటున్నారు పరిశీలకులు. కానీ, ఇప్పటితో ఏమీ అయిపోదని... ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి అటు కోర్టులు కూడా సమర్థించాయని గుర్తు చేస్తున్నారు.
పీపీపీ-విధానం ఏమీ తప్పుబట్టాల్సింది కాదంటూ.. కొన్నాళ్ల కిందట హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక, కేంద్రం కూడా.. ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా త్వరితగతిన భవనాలు అందుబాటులోకి వస్తాయని కూడా భావిస్తోంది. సో.. మొత్తానికి జగన్ ఇప్పటి వరకు ప్రయత్నం చేసినా.. ఇక ముందు ఆయన ఏం చేస్తారన్నది చూడాలి. అయితే.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే సాగాలని నిర్ణయించుకుం ది. అటు కేంద్రం, ఇటు న్యాయవ్యవస్థ కూడా సర్కారుకు అండగా ఉన్న నేపథ్యంలో జగన్ నెక్ట్స్ ఏం చేస్తారన్నది చూడాలి.