జగన్ వారిని అంతలా భయపెడుతున్నాడా..?

Pulgam Srinivas
వైయస్సార్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్ట మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి అత్యధిక అసెంబ్లీ స్థానాలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కడంతో వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా కొనసాగాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ లోకి దిగాలి.


ఇందులో కూటమికి అద్భుతమైన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లో ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. తాజాగా వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అవినీతి మొత్తాన్ని బయటపెడతాం. ప్రస్తుతం ఎవరైతే వైద్య కళాశాలలను , హాస్పటల్ లను తీసుకుంటున్నారో వారిని కూడా జైల్లో పెడతాం అని చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పడంతో చాలా మంది కూటమి ప్రభుత్వ పెద్దలు ఆ మాటలకు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇలా కౌంటర్ ఇస్తూ వస్తుండడంతో కొంత మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి గా కొనసాగుతున్న సమయం లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంతో మంది నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని , అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: