ఏపీ: వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్..?

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో పర్యటించారు. ఆమరిజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో టిడిపి, బీజేపీ ,జనసేన జండాలను మోసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించిన అందరికీ కూడా కృతజ్ఞతలు, తెలుగు జాతి కోసం ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం కలిసి పని చేశామంటూ తెలిపారు.


అమరజీవి జలాధార ప్రాజెక్టు ద్వారా 1.2 కోట్ల ప్రజలకు నీరు అందుతుందని 30 నెలలలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందంటూ తెలియజేశారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయునికి సరైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్టుకి అమరజీవి అని పేరు పెట్టామని తెలిపారు. జన సైనికులు క్రమశిక్షణతో ఉండాలని తాను పెట్టిన సభలకు ప్రధాని మోదీ కూడా రావడానికి భయపడుతున్నారని రాష్ట్రం కోసం ప్రజల కోసం గత ఎన్నికల సమయంలో తగ్గి ఉన్నాను.. చాలామంది పార్టీని అమ్మేశారు అంటూ ఏదేదో కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా నేను పట్టించుకోలేదు కేవలం రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు.


కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు కులాలు తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఎవరి బెదిరింపులకు పవన్ కళ్యాణ్ భయపడడు, ఇంటిలో నుండి బయటికి వచ్చే సమయంలో నేను తిరిగి వెళ్తాననే నమ్మకం లేదు. అయినా సరే తాను ఆ భావనతోనే బయటికి వస్తానంటూ తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజం బెదిరింపులకు పాల్పడితే అసలు సహించేదే లేదని వైసీపీ నేతలు కొంతమంది అంటే నాకు గౌరవం ఉంది. వారు కొంతమంది పద్ధతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా, ఒళ్ళు తెలియకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి తాట తీస్తాం. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ,జనసేన కూడా ప్రభుత్వంలో భాగమే అంటూ  హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: