ఫైర్ పాలిటిక్స్‌కు ఎమోషన్ టచ్ – రేవంత్ రెడ్డి స్పీచ్ హాట్ టాపిక్..!
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. అయితే, ఈ ప్రసంగంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా, భావోద్వేగంగా పెద్ద చర్చకే దారి తీసింది. “డిసెంబరు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు… కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్” అని రేవంత్ చేసిన వ్యాఖ్య అక్కడున్న వారినే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఇట్టే కనెక్ట్ చేసింది. ఆ మాట వెనుక అర్థాన్ని కూడా ఆయన చక్కగా వివరించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టిన నెల డిసెంబరేనని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదేనని గుర్తు చేశారు.
ఇక్కడ మరో చారిత్రక నిజాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది కూడా డిసెంబరు నెలలోనే. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం తెలంగాణ చరిత్రలో మలుపు తిప్పింది. అందుకే… తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నిజంగానే మిరాకిల్ మంత్ అనే రేవంత్ మాట నూటికి నూరుపాళ్లు నిజమనే భావన కలుగుతుంది. ఇలాంటి మాటలు చెప్పడం రాజకీయ నేతలందరికీ సాధ్యం కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయ వ్యూహం, భావోద్వేగం, చరిత్ర… అన్నింటినీ కలిపి చెప్పే కనెక్టింగ్ స్పీచ్‌లకు మాస్టర్‌గా మారుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే… ఆయన మాటలు వింటే కేవలం రాజకీయ ప్రసంగంగా కాకుండా… ఒక అనుభూతిగా మారుతాయి.