జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ బద్ధ శత్రువులు.. కానీ వారి మధ్య ఉన్న ఈ సీక్రెట్ రిలేషన్ మీకు తెలుసా.?

Pandrala Sravanthi
 వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లో చాలా పాపులర్ అయిన నాయకుడు. ఈయన చిన్న వయసు లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు వహించారు. అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈయన బయటికి ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు గుంపులు గుంపులుగా వస్తూ ఆయన కి నీరాజనాలు పలుకుతున్నారు. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు ఈరోజు కావడంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. 


ఈ నేపథ్యం లోనే బద్ధ శత్రువులుగా..  రాజకీయ ప్రత్యర్థులుగా ..ఉన్న జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి, బాలకృష్ణ ఇద్దరు రాజకీయంగా బద్ధ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం బాలకృష్ణ కి వీరాభిమానట. అవును మీరు వినేది నిజమే.. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ అభిమానం వేరే.. 

అసలు విషయం ఏమిటంటే.. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి కడప బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండేవారట. నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి,నరసింహా రెడ్డి ,సమర సింహా రెడ్డి వంటి సినిమాల్లోని ఫ్యాక్షనిజం చూసి బాలకృష్ణ కి జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని అయ్యారట. బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ సినిమాలను చూసి జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో మునిసిపోయేవారని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు. అలా రాజకీయాల్లో బాలకృష్ణ అంటే పడని జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన వీరాభిమాని అనే సంగతి చాలా మందికి తెలియదు.అలాంటి మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇండియా హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: