ఏపీ: ప్రభుత్వం సరికొత్త యాప్..ఉబర్, ర్యాపిడోకు పోటీగా..?

Divya
ఏపీ ప్రభుత్వం తాజాగా సరికొత్త నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పుడు సరికొత్త యాప్ కు శ్రీకారం చుట్టింది. అదే క్యాబ్ సర్వీస్. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ఆపరేటర్లు అయిన ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి వాటిలో ప్రజల ప్రయాణిస్తున్నారు. ఇందులో ఎక్కువగా బైకు ,కారు క్యాబ్ సర్వీసులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీ, వర్షం సమయాలలో అయితే మరింత ఎక్కువగా చేస్తూ ఉండడంతో తప్పని పరిస్థితులలో ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు.


అయితే ఇప్పుడు వాటి భారీ నుంచి తప్పించేందుకు ఏపీ ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ ని తీసుకురానుందట. అదే ఆంధ్రా టాక్సీ పేరుతో  ఈ యాప్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్ని వివరాలను అందజేయబోతున్నారు. తక్కువ ధరకే ట్యాక్సీ, ఆటో వంటి సేవలను మొదటి అందించబోతున్నారు. మొదట ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించబోతున్నారు. అక్కడ ప్రజలు తక్కువ ధరకే తమ ప్రయాణాలను చేరుకునేలా సేవలు అందించనున్నారు.


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల దగ్గర ఆటో, క్యాబ్ డ్రైవర్లు తెలియని వారి నుంచి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయని దీంతో ప్రభుత్వమే ఈ యాప్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. దీనివల్ల పర్యటక రంగం పెరగడమే కాకుండా ప్రజలకు కూడా మెరుగైన క్యాప్ సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ యాప్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మన వివరాలతో లాగిన్ అయ్యి మనం వెళ్లాలనుకున్న ప్రాంతం పేరును సెలెక్ట్ చేసుకుని ఆ యాప్ లో నమోదు చేసుకున్న తర్వాత అందులో డ్రైవర్ వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత బుకింగ్ చేసుకొని సదుపాయాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఆ వాహనాల డేటా బుకింగ్ వంటి సమాచారం కూడా పోలీస్ స్టేషన్ కి చేరేలా ఈ యాప్ ని రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: