అదే జరిగితే హైదరాబాద్ పై రేవంత్ గెలుపు తధ్యం.!

Pandrala Sravanthi
హైదరాబాద్ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేసింది. పాలన సౌలభ్యం ఈజీగా ఉంటుందని ఆలోచించి  గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలను చేర్చుకుంది.. వార్డుల వారీగా చూస్తే 150 వార్డులను 300 వార్డులుగా పెంచేసింది. దీనివల్ల హైదరాబాదు లో  వార్డు సభ్యులు పెరగడమే కాకుండా పరిపాలన సౌలభ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.. మరి ఇంతకీ ఆ వివరాలు ఏంటో చూద్దామా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  కొన్ని మున్సిపాలిటీలను మరియు పంచాయతీలను యాడ్ చేయడం, డీ లిమిలిటేషన్ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు లో కొన్ని ఫిటిషన్లు దాఖలయ్యాయి. 


అయితే దీనిని క్షుణ్ణంగా గమనించినటు వంటి తెలంగాణ హైకోర్టు ఆ పిటీషన్లను అన్నింటిని కొట్టిపారేసింది. డీ లిమిటేషన్ వ్యవహారంపై మేము జోక్యం చేసుకోబోమని కొట్టి పారేసింది. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వానికి అతి పెద్ద ఊరటగా నిలిచిందని చెప్పవచ్చు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ హైదరాబాద్ కాబోతోంది. దేశంలో ముంబయి ఇప్పటికి అతిపెద్ద కార్పొరేషన్ గా ఉంది.ఇప్పుడు దాంతో పోటీపడే కార్పొరేషన్ గా హైదరాబాద్ ఎదగబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా హైదరాబాద్ ని మార్చాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా మార్చేస్తూ పరిపాలన సౌలభ్యం ఈజీగా ఉండేలా చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.


అంతేకాదు హైదరాబాద్ లో అతిపెద్ద ఎన్నికల అస్త్రంగా కూడా ఆయన ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మెయిన్ ఎలక్షన్స్ తర్వాత జరగబోయే హైదరాబాద్ ఎలక్షన్స్ సంచలనాత్మకంగా మారబోతున్నాయి.. రేవంత్ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారడమే కాకుండా  హైదరాబాద్ పై రేవంత్ గెలుపు కూడా సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయి హైదరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: