సౌదీ అరేబియాలో 'మాస్' మార్పులు: షేక్‌ల రాజ్యంలో విప్లవం.. విజన్ 2030 వెనుక అసలు కథ ఇదే!

Amruth kumar
ఎడారుల దేశంగా ప్రపంచానికి తెలిసిన సౌదీ అరేబియా ఇప్పుడు అక్షరాలా మంచు దుప్పటితో కప్పబడింది! సాధారణంగా మండే ఎండలు, ఉష్ణోగ్రతలతోనే గుర్తింపున్న ఈ దేశంలో… ఇప్పుడు మంచు వర్షం, భారీ వానలు ప్రజలను ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని ఈ వాతావరణ మార్పులు “ఇది నిజమేనా?” అన్నట్లుగా అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తబుక్ ప్రావిన్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి పర్వత శ్రేణుల్లో, దాదాపు 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనా ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడింది. సాధారణంగా ఎండిపోయిన కొండలే కనిపించే ఈ ప్రాంతంలో… మంచు పరుచుకోవడం, దానితో పాటు వర్షం కురవడం అరుదైన దృశ్యంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ వైరల్‌గా మారుతూ… ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.



ఈ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. మేఘాలు, చల్లని గాలులు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్లే ఈ తరహా అసాధారణ వాతావరణం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మంచు కురవడం, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదల ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు నదులు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక రాజధాని రియాద్ సహా పలు ప్రాంతాల్లో భద్రత దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్లపై జారి పడే పరిస్థితులు, అకస్మాత్తుగా మారే వాతావరణం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.



నిపుణులు మాత్రం ఈ పరిణామాల వెనుక పర్యావరణ మార్పులు, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ప్రధాన కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు మంచు గురించి ఊహించలేని ఎడారి ప్రాంతాల్లోనే ఇప్పుడు మంచు వర్షం కురవడం… భవిష్యత్తులో మరింత తీవ్రమైన వాతావరణ మార్పులకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే ఎలా ఉంటుందో సౌదీ అరేబియా పరిస్థితి ప్రత్యక్ష ఉదాహరణగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి… ఎడారిలో మంచు కురవడం ఆశ్చర్యంగా అనిపించినా, ఇది మానవాళికి ప్రకృతి ఇస్తున్న గట్టి హెచ్చరిక అని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం పర్యావరణంపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందన్న సందేశాన్ని ఈ దృశ్యాలు బలంగా చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: